హోటల్స్ పున:ప్రారంభం… రిస్కేమో రాజా?

-

కరోనా తీవ్రత లాక్ డౌన్ కు ముందు, లాక్ డౌన్ తర్వాత అన్న చందంగా తయారైన పరిస్థితి. ఈ క్రమంలో లాక్ డౌన్ ముందు చాలా తక్కువ తీవ్రతతో ఉన్న కరోనా.. లాక్ డౌన్ సడలింపుల అనంతరం విజృంభిస్తుంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. జూన్, జూలై నెలలు చాలా జాగ్రత్త.. ఆ రెండు నెలలూ చాలా కీలకం అని నిపుణులు హెచ్చరిస్తూన్నా… ఒకపక్క ప్రభుత్వాలు సడలింపుల పేరుచెప్పి ఆల్ మోస్ట్ లాక్ డౌన్ ఎత్తేసినట్లే చేస్తుంది! ఈ పరిస్థితుల్లో స్వీయ సంరక్షణే శ్రీరామ రక్ష అనే మాటలు వినిపిస్తున్న తరునంలో… హోటల్స్ పున:ప్రారంభం వార్తలు వస్తున్నాయి.

ఏపీలో జూన్ 8 నుంచి అన్ని హోటల్స్ తిరిగి ప్రారంభమవుతున్నాయట. ఈ మేరకు ఈ విషయాన్ని విశాఖ హోటల్ అసోసియేషన్ కార్యదర్శి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు హోటల్లకు వస్తారు అన్న నమ్మకం ఏమాత్రం లేదని చెబుతున్న ఆయనే… బతకాలి కనుక హోటల్స్ తెరుస్తున్నామంటున్నారు. వినియోగదారుడు రాకుండా హోటల్స్ తెరిచినంతమాత్రాన్న బతుకుతారా? ఏమో…! ఇదే క్రమంలో అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని.. బిల్డింగ్ యజమానులు 50% అద్దె మినహాయింపు ఇవ్వాలని సత్యనారాయణ కోరుతున్నారు.

వంద మంది సిట్టింగ్ ఉంటే.. 50 మందికి మాత్రమే కూర్చునేలా సీట్లు అరేంజ్ చేసి, భౌతిక దూరం పాటిస్తూ హోటల్‌ ను నడుపుతామని చెబుతున్నారు హోటల్ అసోసియేషన్ పెద్దలు. ఇదే క్రమంలో… సిబ్బంది చేతికి గ్లౌస్.. తలకి, నోటికి మాస్క్ తప్పనిసరిగా వినియోగిస్తామని పేర్కొంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… ఏసీలు ఉండే హాళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత సులువు అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రజలు సహకరిస్తారా లేదా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news