ఏపీలో నివసించే పేద ప్రజల్లో కొందరికి రేషన్ కార్డ్స్ లేవన్న విషయం తెలిసిందే.. దీని వల్ల వారికి రేషన్ అందక తిప్పలుపడుతున్నారు.. అలాంటి వారు రేషన్‌కార్డ్ ఎలా తీసుకోవాలో తెలియక, ఎవరిని అడిగిన సరైన సమాచారం అందించకపోవడంతో ఈ కార్డ్ లేకుండానే కాలాన్ని వెళ్ళతీస్తున్నారు.. అందుకే వీరి విషయంలో జగన్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది..
ఈ నిర్ణయం వల్ల రేషన్ కార్డుల జారీని మరింత సులభతరం అవుతుందని భావిస్తుంది.. ఇందులో భాగంగా పౌర సరఫరాల ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇక నుండి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పకడ్బందీగా రేషన్ కార్డులు జారీ చేస్తారని తెలిపారు.. అదీగాక ఇకపై ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు.
ఇకపోతే ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్‌కార్డులు జారీ చేయనున్నామని పేర్కొన్నారు.. ఇక ఇప్పటికే తెల్ల రేషన్ కార్డ్ కలిగిన పేదలకు రేషన్ డోర్ డెలివరీలో భాగంగా బియ్యం సంచుల పంపిణీకి కావలసిన పక్రియను సిద్దం చేస్తున్నట్లు, ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి 10, నుండి 15 కిలోల చొప్పున సంచులను, వాలంటీర్ల ద్వారా ఇంటికే హోం డెలివరీ చేయనున్నామని శ్రీధర్ తెలిపారు.. ఇప్పటికే ఏపీలో పేద ప్రజలందరి కోసం జగన్ ప్రభుత్వం వివిధ రకాలైన పధకాలను అమలు చేస్తూ ప్రజల మనసు దోచుకుంటుందన్న విషయం తెలిసిందే..