స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు తరఫున కోర్టులో వాదించేందుకు టిడిపి దేశంలోనే టాప్ న్యాయవాదిగా పేరున్న సిద్ధార్థ్ లూథ్రను నియమించుకుంది. అత్యంత ఖరీదైన న్యాయవాదుల్లో లూథ్ర ఒకరు. కాగా… ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వచ్చారు. ఢిల్లీ బయట కేసులు వాదించేందుకు రోజుకు రూ. 1.50 కోట్ల వరకు ఆయనకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లైట్, లగ్జరీ కారు, స్టార్ హోటల్ లో బస సౌకర్యాలు అదనం.
కాగా, సీఐడీ ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదని ఏసీబీ కోర్టు కు తెలిపారు సిద్ధార్థ్ లూథ్రా. నిబంధలను ప్రకారం దగ్గరలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి.. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ చెబుతోందన్నారు. ముందురోజు రాత్రి 11 గంటలకే చంద్రబాబును సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు.. వ్యక్తిని చుట్టిముట్టి కదలకుండా చేయడం హక్కుల ఉల్లంఘనే, దీన్ని కూడా అరెస్టుగానే పరిగణించాలని కోర్టును కోరారు సిద్ధార్థ్ లూథ్రా.