Nirmala Sitharaman: ముద్ర లోన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.10 లక్షల లోన్ ఇస్తుండగా.. తాజా బడ్జెట్‌లో దాన్ని రూ.20లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా, ఈ లోన్స్‌ను వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తాయి.
ఇక అటు బీహార్‌లో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసింది కేంద్ర సర్కార్. రూ.26,000 కోట్లు ప్రకటించింది కేంద్రం. రాజ్‌గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపించినట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. నలంద యూనివర్సిటీని టూరిస్ట్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ- ఆధార్.. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.