Nirmala Sitharaman: ఏపీ, బీహార్ కు కూడా పూర్వోదయ పథకం అమలు వర్తింప జేస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈశాన్య రాష్ట్రాలకు వర్తించే పూర్వోదయ పథకాన్ని ఏపీ, బీహార్ కు కూడా వర్తింపజేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అటు పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్త చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తామని వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుకు సాయం చేస్తామని వివరించారు.అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామన్నారు. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తామన్నారు నిర్మలా సీతారామన్. అటు ఆంధ్రప్రదేశ్ పురర్ వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని మోదీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సహాయం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.