మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే.. కాన్వాయ్ లో గర్భిణీని ఆసుపత్రికి తరలింపు

-

మన కళ్లముందే ఆటో పడిపోయింది. పడిపోయిన ఆటో మహిాళా ప్రయాణికులు ఉన్నారు. అదే దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే సరిగ్గా అదే సమయానికి ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు. ఆటోపడిపోయిన విషయాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ నిలిపివేయించారు. తన సిబ్బందితో కలిసి వెంటనే ఆటో వద్దకు వెళ్లారు. ఆటోలోని మహిళలను బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆటో సైడ్ కి తిరగబడటంతో వెంటనే దానిని రోడ్డుపైకి తిప్పేందుకు సిబ్బందితో కలిసి ప్రయత్నించారు. ఆటో తిప్పే ప్రయత్నంలో మహిళలు ఒకరిపై మరొకరు పడటాన్ని గమనించి వారిని స్థానికుల సహాయంతో కిందికి దించారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి రైల్వే గేటు వద్ద ఇదంతా చోటు చేసుకుంది.

ఉదయం పదిన్నర గంటల సమయంలో ఎమ్మెల్యే ఆర్కే దుగ్గిరాల మండలం రేంద్రపాడు వెళ్తున్నారు. వారి వాహనం కంటే ముందే ఉన్న ఆటో పెదవడ్లపూడి రైల్వే గేటు వద్ద రాగానే మలుపు తిరుగుతూ సైడ్ కి పల్టీ కొట్టింది. ఇది గమనించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్.కే. రామకృష్ణారెడ్డి వెంటనే కాన్వాయ్ ఆపించారు. తాను దిగి ఆటోను సరిగ్గా రోడ్డుపైకి తీసుకొచ్చారు. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మహిళలను రక్షించారు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది నెలలు నిండిన గర్భిణీ లావణ్య కూడా ఉన్నారు. ఆమె తెనాలి ఆస్పత్రికి వెళ్తున్నారు. ఆటో బోల్తా పడటంతో ఆమె నీరసపడిపోయారు. ఆమె ఆసుపత్రికి వెళ్లడం జాప్యం అయితే లోపాలు ఉన్న బిడ్డకు ప్రమాదం రావచ్చనే భావనతో ఆమెను తన కారులో ఎస్కార్ట్ ఇచ్చి వెంటనే తెనాలి హాస్పిటల్ కి తరలించారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్.కే.ను స్థానికులు అభినందించారు. 

Read more RELATED
Recommended to you

Latest news