69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 6 అవార్డులను సొంతం చేసుకోగా, పుష్ప రెండు అవార్డులను సాధించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కాగా.. ఈ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. ఉత్తమ సంగీతం, ఉత్తమ సాహిత్యం విభాగాల్లోనూ తెలుగు పరిశ్రమ సత్తా చాటింది. ఇక ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో తెలుగు సినిమా మొదటిసారి ఏకంగా 10 అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ఇదే సినిమాలో సీతగా నటించిన అలియా భట్ కు కూడా అవార్డు వరించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన గంగూభాయ్ కతీయావాడి సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ .. 2021 మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది..