వాలంటీర్ల జోలికి వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఏలూరులో ఆదివారం ఆళ్ళ నాని మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థను కూలదొయ్యడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీచానికి దిగజారారని మండిపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలను అందించడానికి అవినీతి లేకుండా పారదర్శకంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని అన్నారు.
పేదవారు ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఒక్క హామీని కోల్పోకూడదు అని అత్యంత పారదర్శకంగా వ్యవస్థను నడపాలని జగన్ ఈ వ్యవస్థను తీసుకువచ్చారని.. వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నీచమైన స్క్రిప్ట్ రాసి ఇస్తే.. కనీస మానవత్వం లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని.. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు.