ప్రజలను ఆకట్టుకోవడానికి వ్యాపారులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రజలను ఆకర్షించడానికి తమ వద్ద కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు జనాలు. ముఖ్యంగా వ్యాపారాల్లో కొత్తదనం ఉంటే ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల్లో ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు మన దేశానికి కూడా ఈ సంస్కృతి వచ్చింది అనేది వాస్తవం.
రెస్టారెంట్ పేరు నుంచి లోపల ఏర్పాట్ల వరకు అన్నీ కూడా కొత్తగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఒక రెస్టారెంట్ ని ఏర్పాటు చేసారు. అందులో వింత ఏముంది అంటారా…? సాధారణంగా రెస్టారెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది…? ఒక స్థలం అద్దెకు తీసుకుని లేదా లీజుకి తీసుకుని అక్కడ ఒక పెద్ద భావనమో చిన్న భవనమో కట్టి ఏర్పాటు చేస్తారు.
కాని గన్నవరంలో మాత్రం ఒక పాత విమానాన్ని కొనుగోలు చేసి దానిలో రెస్టారెంట్ ని ఏర్పాటు చేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయంలో పడి ఉన్న పాత విమానాన్ని కొనుగోలు చేసి దానిలో అత్యాధునిక సౌకర్యాలతో విమానాన్ని ఏర్పాటు చేసారు. లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడింది. తర్వాత ఓపెన్ చేస్తారు.