ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం..కరెంట్ కోతలు తప్పవా !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగడంతో.. సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభం అయింది.

దీంతో అందుబాటులోకి రెండు వేల మెగావాట్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ వినియోగం తగ్గడంతో యూనిట్లను అండర్ రిజర్వ్ షట్ డౌన్ లో పెట్టింది NTPC. ఇక ఇప్పుడు సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభించారు. ఏపీలో కరెంట్‌ కోతలు లేకుండా.. ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.

ఇది ఇలా ఉంటే, నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news