ఎడిట్ నోట్: జగన్ మార్క్ స్కెచ్.!

175కి 175 సీట్లు గెలవాలి..ఇది జగన్ టార్గెట్. వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల టార్గెట్ తో జగన్ బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారు..ఈ సారి ఎన్నికల్లో 175 గెలవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక ప్రజలకు అంతా మంచే చేశాం..దాదాపు రెండు లక్షల కోట్ల పైనే పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు ఇచ్చాం..రాష్ట్రంలో ఎక్కువ శాతం పథకాలు అందుకున్న వారే ఉంటారు..కాబట్టి వారంతా తమకే మద్ధతు ఇస్తారని జగన్ భావిస్తున్నారు.

అలా నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పికి చెక్ పెట్టి గెలవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఊహించని స్కెచ్ లతో ముందుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. టి‌డి‌పికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉందని ఎప్పటినుంచో ప్రచారం వస్తుంది. అయితే ఈ ప్రచారం చేసేది కేవలం టి‌డి‌పి మాత్రమే..వైసీపీ అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశం లేదని చెప్పేస్తుంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.

కానీ టి‌డి‌పి మాత్రం..జగన్ కచ్చితంగా ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం చేస్తుంది. అయితే ముందస్తుపై జగన్ సైలెంట్ వ్యూహంతో వస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే టి‌డి‌పికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వస్తే ముందస్తుకు రావచ్చని తెలుస్తోంది. అందుకే ముందస్తుపై జగన్ మౌనంగానే ఉంటున్నారని సమాచారం. అన్నీ అనుకూలంగా ఉన్న పరిస్తితుల నేపథ్యంలో జగన్ అనూహ్యంగా ముందస్తు వైపుకు మొగ్గు చూపి టి‌డి‌పికి షాక్ ఇవ్వవచ్చు.

ముందస్తు అంటూ అంచనా వేస్తున్న టి‌డి‌పికి..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళి చెక్ పెట్టవచ్చు. అసలు జగన్ వ్యూహం అంచనా వేయడానికి లేకుండా ఉంది. ఆయన సమయానికి తగ్గట్టుగా రాజకీయం చేయాలని చూస్తున్నారు. అందుకే ఆయన వ్యూహాలు అర్ధం కావడం లేదు. ఏదేమైనా గాని ఎప్పుడు ఎన్నికలు జరిగిన టి‌డి‌పికి చెక్ పెట్టడమే జగన్ టార్గెట్ గా ఉంది.