వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన.. మర్డర్ కి మహిళ బంధువులు ప్లాన్..!

-

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో తన కోరిక తీర్చాలని వివాహిత పట్ల వెంకట రమణ అనే వ్యక్తి అసభ్య కరంగా ప్రవర్తించాడు. అయితే కృష్ణవరం గ్రామంలో వెంకట రమణ ఎలక్ట్రీషియన్ గా పని చేస్తుంటాడు. వివాహిత పట్ల వెంకట రమణ దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ విషయాన్ని సదరు మహిళా తన కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపి బాధ పడింది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న వివాహిత బంధువులు ఎలక్ట్రీషియన్ వెంకటరమణను పథకం ప్రకారం.. చంపేందుకు ప్లాన్ చేశారు. 

Kakinada Crime
Kakinada Crime

వెంకటరమణను మర్డర్ చేసేందుకు వివాహిత బంధువులు సతీష్, శివ, రాజ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. వారి ప్లాన్ ప్రకారం.. తమ పొలంలో మోటార్ పని చేయడం లేదని వెంకటరమణను సతీష్ పిలిచాడు. ఎలక్ట్రిషియన్ వెంకటరమణను తీసుకొని సతీష్ పొలం వద్దకు చేరుకున్నాడు. ఈ తరుణంలో అక్కడికి వచ్చిన వెంకటరమణ పై ముగ్గురు కలిసి దాడి చేశారు. వెంకటరమణ దాడి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వివాహిత బంధువులు వెంకటరమణ బైకు ను దగ్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news