వైసీపీ ఈ ఎన్నికల ను బాయికాట్ చేసింది : అవినాష్ రెడ్డి

-

సాగునీటి సంఘాల ఎన్నికలు విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పై మండిపడ్డ కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. బిటెక్ రవి మాటలు సినిమా ను తలపిస్తున్నాయి అని అన్నారు. సినిమా డైరెక్టర్, నిర్మాత, ప్రేక్షకుడు అన్ని ఆయనే. ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలంటే, నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి ఇవ్వాలి ఎన్నికలు కోరుకునే వారైతే. ప్రతి రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేది. విఆర్ఓ ల ను అందుబాటులో పెట్ట కుండా అందరిని ఎమ్మార్వో కార్యాలయంలో దాచారు.

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగి ఉన్నింటే చొక్కా విప్పేవారు రైతులు. ఖైదీలను బందించినట్లు వి ఆర్ ఓ లను ఎమ్మార్వో కార్యాలయంలో ఎందుకు బంధించారు. నో డ్యూస్ సర్టిఫికేట్ కు రాలేదని మాట్లాడడం సిగ్గు ఉండాలి. రైతులు మీకు ఎందుకు ఓటు వేస్తారు. ఈ క్రాఫ్ విధానం రద్దు చేస్తామన్నారు మరి ఎందుకు రద్దు చేయలేదు. రైతులకు నో డ్యూస్ ఇవ్వకుండా అడ్డుకున్న దద్దమ్మవి నీవు. జమ్మలమడుగు లో వి ఆర్ ఓ లను దేవగుడిలో బందించినది వాస్తవం కాదా. రైతులు పోటీ చేస్తే ఒడిపోతామని వి ఆర్ ఓ లను బందించలేదా. నో డ్యూస్ సర్టిఫికెట్ లు రాకుండా చేయడంతో వైసీపీ ఈ ఎన్నికల ను బాయికాట్ చేసింది అని అవినాష్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news