భారత కుబేరులు వీరే…!

-

ఢిల్లీ: సంపద ఎక్కువగా ఉంటే ఎవరైనా టాటా బిర్లాతో పోల్చేవారు. ఇప్పుడు ముకేష్ అంబానీ, అదానీ అని పిలిచే పరిస్థితి వచ్చిందనే చెప్పుకోవచ్చు. కరోనా వచ్చినా వీరి వ్యాపారాలు దూసుకెళ్లాయి. ఏడాదికాలంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద పెరిగిన తీరును గమనిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. 2019 డిసెంబర్ నుంచి ఈ ఏడాది చివరికి వీరిద్దరి సంపద రూ.లక్ష కోట్లకు పెరిగిందని ఈటీ అనే ఆంగ్ల పత్రిక ప్రచురించింది.

mukesh ambani-adani
mukesh ambani-adani

కరోనా వ్యాప్తి చెందినా.. ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కుబేరుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఏడుగురు కుబేరుల సంపద సుమారు రూ.4,73,000 కోట్లు (64 బిలియన్ డాలర్లు) వరకు పెరిగింది. సైరస్ పూనావాలా (సీరమ్ ఇనిస్టిట్యూట్) ఆస్తి విలువ రూ.1,14,878 కోట్లు, అజీమ్ ప్రేమ్ జీ (విప్రో) ఆస్తి విలువ రూ.1,73,790 కోట్లు, శివ్ నాడార్ (హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్) ఆస్తి విలువ రూ.1,62,008 కోట్లు, దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా) ఆస్తి విలువ రూ. 71,357 కోట్లు, రాధాకిషన్ దమానీ (డిమార్ట్) ఆస్తి విలువ రూ.1,06,040 కోట్లు. వీరి సంపద విలువ కరోనా సమయంలోనూ గణనీయంగా పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒక దశలో స్టాక్ మార్కెట్ భారీగా కుదేలైంది. ఆ తర్వాత పుంజుకుని సూచీలు రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ఏడాదికాలంలో సెన్సెక్స్ 11.5 శాతం వరకు పెరిగింది. సెన్సెక్స్ కంటే ఈ ఏడుగురి కంపెనీల షేర్లు భారీగా పెరగడం విశేషమనే చెప్పుకోవచ్చు.

ఈ ఏడుగురి సంపద ఉమాంతం పెరగడానికి గల కారణాలు ఇవే. అదాని గ్రీన్ ఎనర్జీ షేరు 525 శాతం పెరగడంతో సంపద వృద్ధి చెందినది. 2019 డిసెంబర్ నాటికి అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ విలువ రూ.26,040 కోట్లు ఉండగా.. 2020 డిసెంబర్ 12 నాటికి ఈ విలువ రూ.1.63 లక్షల కోట్లకు చేరింది. అలాగే ముకేశ్ అంబానీకి చెందిన 6 కంపెనీలు స్టాక్ ఎక్సేంజ్ లో నమోదయ్యాయి. ముకేశ్ సంపద భారీగా పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రముఖ పాత్రను పోషించాయి. 2019 చివరి నాటికి ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.9.59 కోట్లు ఉంటే.. 2020 డిసెంబర్ 12 నాటికి రూ.13.56 లక్షల కోట్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news