తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉంది. ఈ క్రమంలో తమకు కలిసి వచ్చే అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అధికార పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు భారతీయ జనతా పార్టీ ఒక టీం ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఏకంగా ఒక మంత్రి సోదరుడు టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి చేరే అవకాశం కనిపిస్తోంది.
వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ బిజెపిలో చేరే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం మీద కన్నేసిన ఆయన ఆ టికెట్ తనకు ఇస్తే పార్టీలోకి వస్తానని చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయన వెళ్ళడం వలన తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని టిఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఒక పార్టీలో ఉన్నవారు పార్టీ మారడం సహజమే అని ఎర్రబెల్లి తన సొంత సోదరుడి గురించి కామెంట్ చేయడం ఆయన పార్టీ మార్పునకు మరిన్ని సంకేతాలు ఇచ్చినట్లు అయింది.