ఏపీలో వార్ వన్ సైడ్.. ఎంపీ కేసినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

-

జనసేన టీడీపీ పొత్తు పై కౌంటర్ వేశారు ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు.. మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. మూడు రోజుల నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా  అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు ఎంపీ కేసినేని నాని.

ఎంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్ ని ఓడించడం ఒక కలనేని పేర్కొన్నారు. వైసీపీ 175 కి 175 స్థానాలు గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో చంద్రబాబు ప్రధాని అపాయింట్ మెంట్ కోసం కాదని.. అమిత్ షా కోసం పడిగాపులు కాశారని తెలిపారు. జగన్ దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని దుయ్యబట్టారు. జన సైనికుల ఆత్మగౌరవాన్ని లోకేష్ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ అని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని తెలిపారు ఎంపీ కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Latest news