సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు..జిల్లా హెడ్ క్వార్టర్ గా హిందూపురం !

-

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు నందమూరి బాలకృష్ణ.

సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా… జిల్లా హెడ్ క్వార్టర్ ను హిందూపురం చేయాలంటూ గతంలోనే బాలకృష్ణ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలతో మరోసారి సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు తప్పదా? అని అందరూ చర్చించుకుంటున్నారు.

ఇక అంతకు ముందు హిందూపురం ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే బాల కృష్ణతో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ చేతన్. అనంతరం అల్పా హారాన్ని స్వయంగా వడ్డించారు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాల కృష్ణ. నిన్న సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారని గుర్తు చేశారు నందమూరి బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news