చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డొల్ల కంపెనీలు పెట్టి అడ్డంగా దోచుకున్నారు. ఏ మొహం పెట్టుకొని నీతి పాలన చేశామని.. చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు. డబ్బులను రకరకాల అకౌంట్ లోకి మళ్లించారు. డబ్బులను రకరకాల అకౌంట్ లోకి మళ్లించారు. రూ.371 కోట్ల స్కామ్ జరిగితే అది పెద్ద స్కామ్ అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు కానుకలోనూ అవినీతి చేశారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో బెల్లం స్కామ్ కూడా జరిగింది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా దొంగ చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు.

చేసిన నేరాలకు జైలులో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది అని సూచించారు కన్నబాబు. ప్రత్యేక హోదా అవసరం లేదని స్వీట్లు పంచాడు. చంద్రబాబు కుదుర్చకుంది ముమ్మాటికి చీకటి ఒప్పందమే అని విమర్శించారు. క్యాబినెట్ లో ఆమోదం చేసింది ఒకటైతే.. ఒప్పందం చేసుకుంది మరోలా అని ఆరోపించారు.