చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

-

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై కోర్ట్ సీఐడీ వాదనలతో ఏకీభవించి కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది. ఈ నిర్ణయంతో టీడీపీ నేతలకు నిదుర పట్టడం లేదు, బహుశా ఈ షాక్ ను ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. తాజాగా ఈ విషయంపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఇప్పటికీ మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఈ రోజు హై కోర్ట్ చెప్పింది కేవలం రిమాండ్ ను విధించడం సబబు అని మాత్రమే చెప్పింది.. కానీ చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు చెప్పలేదంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఇంకా కోర్ట్ మేము కేసు విచారణ దశలో ఉండగా మేము ఎటువంటి జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చినట్లు అర్థమని అచ్చెన్నాయుడు చంద్రబాబు ను వెనకేసుకు వచ్చారు. రాష్ట్రము మొత్తం చంద్రబాబుకు మద్దతుగా ఉందని అచ్చెన్నాయుడు చెప్పారు.

ఎన్ని రోజులు అయినా మచ్చలేని మనిషిగానే చంద్రబాబు బయటకు వస్తారంటూ పూర్తి నమ్మకాన్ని తెలియచేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news