నిన్న మొన్నటి వరకు లాక్‌డౌన్ కష్టాలతో అల్లాడిపోయి.. ఏం తిన్నారో.. ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిని ఎర్పడి అల్లా డిపోయిన వలస కూలీల విషయంలో కేంద్రం కరుణించింది. కరోనా మహమ్మారి కారణంగా సడెన్‌గా ప్రకటించిన లాక్‌డౌన్‌తో మా ర్చి 22 నుంచి ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకుని పనికోసం వెళ్లిన కా ర్మికులు ఈ లాక్‌డౌన్ కారణంగా పనులు నిలిచిపోయి.. పరిశ్రమలు ఆగిపోవడంతో రోడ్డున పడ్డారు. దీంతో ప్రభుత్వాలు వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాయి. అక్కడ కూడా వసతులు చాలక పోవడం.. వలస కూలీలకు తగినంతగా క్వారంటైన్లు లేక పోవడంతో ఎక్కడి నుంచి వచ్చారో .అక్కడకు వెళ్లేందుకు వలస కార్మికులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే కరుణించిన కేంద్ర ప్రభుత్వం వారిని స్వస్థలాలకు పంపేందుకు మూడో విడత లాక్‌డౌన్ ప్రారంభ సమయంలో సో మవారం వారికి అవకాశం కల్పించింది. అయితే, ఈ సమయంలో ఒక దుమారం తెరమీదికి వచ్చింది. రాష్ట్రాల ప్రోద్బలంతోనే తా ము వలస కార్మికులను తరలించేందుకు రైళ్లను ఏర్పాటు చేశారు. అయితే, దీనికి సంబంధించి వలస కార్మికులే రైలు టికెట్లు భరించాలని రైల్వే శాఖ ప్రకటించింది.ఇది మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చే లా చేసింది. దీంతో వెనువెంటనే స్పందించిన కేంద్రం టీ కప్పులో తుఫాన్ మాదిరిగా ఈ సమస్యను పరిష్కరించింది.
తాము మొత్తం టికెట్ల వ్యయంలో 85 శాతం భరిస్తామని, రాష్ట్రాలు 15 శాతం భరిస్తే చాలని చెప్పి ముగింపు పలికింది. అయితే, ఇప్పుడు ఈ ఒక్క సమస్యకు పరిష్కారం చూపించినంత మాత్రాన కేంద్ర బాధ్యత లాక్‌డౌన్ విషయంలో తరిగిపోదని అం టున్నారు పరిశీలకులు. నిజానికి ఇప్పుడు రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయింది. ఒడిసా, ఏపీ,తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు సహా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ లలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగాపశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రం కోరుతున్న విధంగా జీఎస్టీని మూడు మాసాలపాటు ఎత్తేయడంతోపాటు.. పరిశ్రమలకు ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అదేసమయంలో గత జనాభా లెక్కల ప్రకారమే పన్నుల్లో రాష్ట్రాల వాటాలను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇక, జన్‌ధన్ ఖాతాల్లో వేస్తున్న రూ.500 వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదనే వాదనను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఎం.ఎస్ ఎం.ఈ వంటి చిన్నకారు సంస్థలను ఆదుకోవాల్సిన పూనిక పరిఢవిల్లాలి. లేనిపక్షంలో మోడీ ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత .. ప్రజాకోర్టులో నిలబడాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆర్ధిక నిపుణులు.