ఏపీ రైతులకు శుభవార్త..చరిత్రలో తొలిసారిగా కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల

-

ఏపీ రైతులకు శుభవార్త..కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని‌ ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా తూర్పు డెల్టాకి 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 500 క్యూసెక్కులు సాగునీటిని విడుదల చేశారు ఏపీ మంత్రులు.

కృష్ణ డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని విడుదల చేయడం రికార్డు కాగా.. ప్రతీ ఏటా కృష్ణా ఆయకట్టుకి జూలై నెలలో మాత్రమే సాగునీటిని విడుదల చేసే పరిస్ధితి ఉండేది. ఈ సారి నెల రోజుల‌ముందే సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం… కృష్ణా డెల్టా పరిదిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం,పశ్చిమగోదావరి జిల్లాలు ఉండగా.. పులిచింతలలో పుష్కలంగా నీరు… అందుబాటులో 35 టిఎంసిల సాగునీరు రానుంది.

మరో రెండు రోజులలో ఎపిలో ప్రవేశించనున్న రుతుపవనాలు.. రుతు పవనాల రాకతో సాగునీటికి ఇబ్బంధి ఉండదంటున్నారు రైతులు. ఇప్పటికే జూన్ ఒకటి నుంచి గోదావరి డెల్టా పరిదిలోనూ సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం… సాగునీటిని ముందుగా విడుదల చేయడం వల్ల నవంబర్ లో‌పూర్తి కానుంది ఖరీఫ్. రెండవ పంటని కూడా డిసెంబర్ నెలలోనే వేసుకునే అవకాశం ఉండనుంది. కృష్ణా డెల్టాకి 155 టిఎంసిల సాగునీరు అవసరమవుతుందని సాగునీటి అధికారుల అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news