గంటా శ్రీనివాసరావు వైఖరిపై చంద్రబాబు సీరియస్ ?

-

రుషికొండ భవనాలకు వెళ్లి..మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న భవనాలను విడుదల చేసి…జగన్‌ పై బురద జల్లే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అయితే… ఈ తరుణంలోనే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ganta srinivas slams jagan

రుషికొండపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోక ముందే కేవలం ప్రచారం కోసం మీడియాని వెంటబెట్టుకు వెళ్లి హడావుడి చేయటమేమిటంటే సీఎంఓ మండి పడినట్లు సమాచారం. ఇకపై ప్రభుత్వ అనుమతి, పార్టీ అనుమతి లేకుండా ఇటువంటి పనులు చేయద్దు అని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. ప్రభుత్వం వీటిని పరిశీలించి ఏమి చేయాలన్న నిర్ణయం తీసుకోక ముందే గంటా శ్రీనివాసరావు చేసిన హడావుడి వల్ల ప్రభుత్వ ఆశయాలకు విఘాతం కలిగిందని సీఎం భావించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news