Jagan: ఈవీఎంలపై వైరల్ గా జగన్ పాత వీడియో !

-

ఈవీఎంలపై వైరల్ గా జగన్ పాత వీడియో వైరల్‌ చేస్తున్నారు టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు. బ్యాలెట్ ఓటింగ్ జరగాలని జగన్ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడిన పాత వీడియో వైరల్ అవుతుంది. ’80 శాతం మంది ఓట్లు వేశారు. తాము వేసిన పార్టీకి ఓటు పడింది కాబట్టే పోలింగ్ కేంద్రాల నుంచి ప్రజలు సంతృప్తితో బయటికి వచ్చారు.

Jagan’s old video on EVMs went viral

నేను వెళ్లి ఫ్యానుకు ఓటేస్తే వీవీప్యాట్ లో సైకిల్ గుర్తు కనిపిస్తే ఎందుకు ఊరుకుంటాను.’ అని జగన్ మాట్లాడిన వీడియోను టీడీపీ, జనసేన పోస్ట్ చేసింది. కాగా..తాజాగా ఈవీఎంలపై జగన్‌ కీలక ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయని ఈ ట్వీట్‌ లో పేర్కొన్నారు. మన దగ్గర కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లే వాడాలి.. న్యాయం జరగడమే కాదు.. జరిగినట్లు కనిపించాలని డిమాండ్‌ చేశారు వైఎస్‌ జగన్‌. దీంతో ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడిన పాత వీడియో వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news