కోర్టు వాకిట జ‌గ‌న్ గెలిచారా ? ఓడారా ?

3 రాజ‌ధానులు అంటూ జ‌గ‌న్ స‌ర్కారు తెగ హ‌డావుడి చేసింది. అయితే ఇందుకు టీడీపీ ఒప్పుకోవ‌డం లేదు. ఆ రోజు ఒక మాట ఇప్పుడొక మాట చెప్పి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ‌ప‌ట్టించ‌డం త‌గ‌ద‌ని కూడా అంటోంది.ఈ క్ర‌మంలో జ‌గ‌న్ త‌న తెలివిని అంతా ఉప‌యోగించి రాజ‌ధాని భూముల వేలంకు ప్ర‌భుత్వం చూసినా కోర్టు ఒప్పుకోవ‌డం లేదు క‌నుక భవిష్య‌త్ లో రాజ‌ధాని ప‌నులు చేప‌ట్టాలంటే ఆర్థిక అవ‌స‌రాల‌కు అయినా APభూమి వేలం త‌ప్ప‌ద‌ని చెప్పే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ్య‌లేం. ఆ విధంగా నిధుల స‌మీక‌ర‌ణ త‌రువాత రాజ‌ధాని నిర్మాణ ప‌నులు వాయిదా వేసినా వేస్తారు. ఏ విధంగా చూసుకున్నా ఆర్థిక కార‌ణం ఒక్క‌టి సాకుగా చూపి జ‌గ‌న్ త‌ప్పించుకోవ‌చ్చు కూడా !

స్టేట‌స్ రిపోర్ట్ ఇవ్వ‌మ‌ని ఇవాళ హై కోర్టు ఓ మాట చెప్పింది ఏపీ స‌ర్కారుకు.. అమ‌రావ‌తికి సంబంధించి దాఖ‌ల‌యిన పిటిష‌న్ కు కోర్టు ఇచ్చిన రెస్పాన్స్ ఇది. రాజ‌ధాని రైతులు ఇటీవ‌ల మళ్లీ కోర్టును ఆశ్ర‌యించి త‌మ గోడు చెప్పుకుని, కోర్టు ధిక్క‌ర‌ణకు ఏ విధంగా ప్ర‌భుత్వం పాల్ప‌డుతోంది అన్న‌ది వివ‌రించే ప్ర‌య‌త్నం ఒక‌టి త‌మ పిటిష‌న్ ద్వారా చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఇప్ప‌టిదాకా రాజ‌ధాని ప‌నులు ఏందాక వ‌చ్చాయో త‌మ‌కు చెప్పాల‌ని చెబుతూ కేసును మ‌రో రెండునెల‌ల‌కు అంటే జూలై 12కు వాయిదా వేశారు త్రిసభ్య క