కాంగ్రెస్ ఇలాగే పాలించి ఉంటే… ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా : రేవంత్ రెడ్డి

-

ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి. చంచల్ గూడ జైలులో ఉన్న విద్యార్థులను కలవడానికి రాహుల్​ గాంధీకి అనుమతి ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీ జితేందర్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి, సంపత్​కుమార్​తో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అనుమతి ఉన్నా… లేకపోయినా రాహుల్ గాంధీ చంచల్ గూడ జైళ్లో ఉన్న ఎన్ఎస్​యూఐ కార్యకర్తలను పరామర్శించి తీరుతారని రేవంత్ రెడ్డి అన్నారు.

No job postings for last 7 years in Telangana: Revanth Reddy

అధికారులపై నాయకులు ఒత్తిడి తెస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నడూ లేనంత నిరంకుశంగా కేసీఆర్ పాలిస్తున్నాడని… కాంగ్రెస్ ఇలాగే పాలించి ఉంటే… ప్రత్యేక రాష్ట్రం రాకపోయేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే రాహుల్, ఓయూకు వెళ్లడానికి అంగీకరించారని…. ప్రభుత్వం మాత్రం అధికారులు, పోలీసుల అండతో అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ప్రజా స్వామ్య బద్దంగా అనుమతి కోరుతున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news