గగన్ యాన్ సాంకేతిక లోపంపై ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇస్రో చేపట్టిన గగన్ యాన్ క్రూ మాడ్యూల్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్ర వేత్తలు. ప్రయోగానికి 5 సెకండ్ల ముందు ప్రయోగం ఆపాలని కంప్యూటర్ కు ఆదేశించారు. భూమి నుంచి 17 కిలో మీటర్ల ఎత్తుకు వెళ్లి కిందకు రావాల్సిన క్రూ మాడ్యూల్.. కానీ సాంకేతిక సమస్యపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చర్చలు జరిగింది.
అనంతరం ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇక ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ మాట్లాడుతూ.. అనుకున్న విధంగా ఈరోజు ప్రయోగాన్ని చేయలేకపోయామని… వాతావరణం లో మార్పుల వల్ల ప్రయోగాన్ని 8 గంటల 45 నిమిషాలకు వాయిదా వేశామన్నారు. సాంకేతికలోపం వల్ల ప్రయోగాన్ని నిలిపివేశామని వివరించారు. రాకెట్ సురక్షితంగానే ఉందని.. సాంకేతిక సమస్యలను గుర్తించే ప్రక్రియలో నిమగ్నమయ్యామన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తామని.. అన్నీ విశ్లేషించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని వివరించారు.త్వరలోనే మళ్లీ ప్రయోగం చేస్తామన్నారు ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్.