BREAKING : నింగిలోకి దూసుకెళ్లిన PSLV C-56 రాకెట్

-

మరో ప్రయోగాన్ని శ్రీహరి కోటలోని ఇస్రో సక్సెస్ చేసింది. తాజాగా PSLV C-56 రాకెట్ ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్‌ చేసి..నింగిలోకి వదిలింది ఇస్రో. ఇవాళ ఉదయం 6.30 గంటల కు శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన PSLV C-56 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన PSLV C-56 కు నిన్న ఉదయం 5 గంటల 1 నిముషానికి ప్రారంభమైంది కౌంట్ డౌన్. 25.30 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగింది.

ISRO to launch PSLV-C56
ISRO to launch PSLV-C56

ఈ కౌంట్ డౌన్ అనంతరం ఇవాళ మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్వి సీ -56. సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహం తో పాటు అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనుంది పీఎస్ఎల్వి – సీ56 రాకెట్. ఇది పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news