వరదలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..బాధితలకు రక్షణ కల్పించండి !

-

తెలంగాణలోని వరద పరిస్థితిపై మూడో రోజూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యవేక్షణ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తాజాగా మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చారు.

వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మూడో రోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఫోన్లో ఆదేశించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రక్షణ చర్యల కోసం సీఎస్‌ శాంతి కుమారికి సీఎం శ్రీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలను చేపడుతూ ముంపుకు గురైన ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను అందించేలా సీఎస్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వరదలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వానలు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news