జగనన్న ఇంకా వదిలేస్తే బెటర్ ఏమో!

ఏందో జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది అమలు అవ్వడం చాలా కష్టంగా మారిపోయింది..ఆయన తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడు ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు…మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు..కానీ ఇది రాజకీయంగా అమరావతిని నాశనం చేయడానికే తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శించే పరిస్తితి.

అయితే జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి…చివరికి ఎక్కడవరకు వచ్చిందంటే..మూడు రాజధానుల బిల్లుని జగన్ ప్రభుత్వమే వెనక్కి తీసుకునేలా పరిస్తితి వచ్చింది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రాజధానుల అంశంపై తాజాగా హైకోర్టు తీర్పు కూడా వచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చిచెప్పింది.

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు.. 3 నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని డెడ్ లైన్ కూడా విధించింది. ఇక అమరావతి భూములని రాజధాని అవసరాలకే తప్ప…తనఖా పెట్టడానికి వీల్లేదని తీర్పు వచ్చింది.

సరే ఎలా వచ్చిన సరే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోర్టు చెప్పింది… తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు…అలాగే దీనిపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాలని జగన్ ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతుంది…మరో రెండేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయి..అలాంటప్పుడు ఈ రాజధాని వివాదం వదిలేసి..రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెడితే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడే పరిస్తితి. మరి చూడాలి ఇకపై రాజధాని అంశం ఏ విధంగా ముందుకెళుతుందో.