ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్ కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నాం – సీఎం జగన్

-

ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్ కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని ప్రకటించారు సీఎం జగన్. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులు విడుదల చేశారు సీఎం జగన్. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 51 మందికి కొత్తగా అడ్మిషన్లు అందించారు. అలాగే…51 మంది నిమిత్తం రూ. 9.50 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు సీఎం జగన్‌.

Andhra Pradesh Govt Announces regervations

ఇప్పటికే విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న 408 మంది విద్యార్థులకు ఈ సీజనులో రూ 41.50 కోట్ల చెల్లింపులు జరుపుతున్న ప్రభుత్వం…ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తంగా రూ. 107 కోట్లు ఖర్చు పెట్టింది. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్….ప్రిలిమ్స్ పాస్ అయిన 95 మందికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు.

మెయిన్స్ పాస్ అయిన 11 మందికి రూ. 1.50 లక్షల సాయం చేశారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థుల తలరాతలు మారుస్తున్నాయని చెప్పారు. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి వెళ్లిన విద్యార్థులు రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకోవాలని… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మరింత పేదలకు ఉన్నత స్థితిలోకి వెళ్లిన విద్యార్థులు ఆదుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news