రాష్ట్ర అప్పులను ఎక్కువగా చూపించారు : హరీశ్ రావు

-

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని గురించి  చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు అని  పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతాయా అని ప్రశ్నించారు హరీశ రావు. రూ.72వేల కోట్లు రైతు బంధు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ట పెంచాలి.. కానీ తగ్గించే ప్రయత్నం చేయలేదు. మేము మాత్రం ప్రాణం పోయినా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని కేంద్రప్రభుత్వానికి తెగేసి చెప్పాం.

గతంలో గ్యాస్ పై కేంద్రం సబ్సీడీ ఎత్తేసింది. కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వానికి సంబంధం లేదనడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వాన్ని బద్ నాం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ కంటే ఎక్కువగా అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. వైద్యారోగ్యంపై ఆరు రెట్లు ఖర్చు పెంచామని తెలిపారు. కరోనా వల్ల అధికంగా అప్పులు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. గత ప్రభుత్వం ఏం చేయలేదనే తప్పుడు చూపిస్తున్నారు. రాష్ట్ర పరపతిని దెబ్బ తీయాలని చూస్తున్నారని చెప్పారు హరీశ్ రావు. 

Read more RELATED
Recommended to you

Latest news