ఆ అకౌంట్లదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. 2.62 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ

-

అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాల్లో సీఎం జగన్ నేరుగా నగదు జమ చేశారు. డిసెంబర్ 2022, జులై 2023 మధ్య కాలంలో పథకాలు అందని 2,62,169 మందిని గుర్తించి వీరి ఖాతాల్లో రూ.216.34 కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా బటన్ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. కొత్త పెన్షన్ బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తున్నట్టుగా సీఎం జగన్ వివరించారు. కొత్తగా నమోదైన లబ్దిదారుల సంఖ్యతో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 64 లక్షల 27 వేలకు చేరిందని చెప్పారు సీఎం జగన్. చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ని రూ.2,750 కి పెంచామని గుర్తు చేశారు. జగనన్న చేదోడు ద్వాారా 43,131 మందికి సహాయం చేసినట్టు వెల్లడించారు. 2,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలు.. 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version