ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. మరిన్ని కారుణ్య నియమాకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆర్టీసీలో మరిన్ని కారుణ్య నియామకాలకు దరఖాస్తులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను జగన్ ప్రభుత్వం ఆదేశించింది.
అనారోగ్య కారణాలతో 2020 జనవరి 1 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారి వారసుల్లో అర్హులను కమిటీల ద్వారా ఎంపిక చేసి, కారుణ్య నియామకాలు చేపట్టాలని సూచించింది. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది.
ఇక అటు ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే వార్త చెప్పారు. జగనన్న తోడు పథకం లో భాగంగా నాలుగో ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం ఇవాళ నిర్వహించనుంది. 5.1 లక్షల మంది ఖాతాలలో పదివేల రూపాయల చొప్పున ఏకంగా 510 కోట్లను జమ చేయనుంది జగన్ సర్కార్.