పేదలకు జగన్ శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.35 వేలు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పేద ప్రజలకు గుడ్‌ న్యూస్‌. తాజాగా పేద ప్రజలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది.

ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు ఇస్తుండగా…. అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ. 35000 చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. పేదలు నిర్మించుకుంటున్న ఇళ్ళకు ప్రభుత్వం ఉచితంగానే ఇసుక సరాఫరా చేస్తోంది. ఇంటికి అవసరమైన ఇతర సామాగ్రిని తక్కువ ధరకే అందిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా…. ఇందులో 12,61,301 మందికి పావలా వడ్డీకి రూ. 4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news