పేదల ఇళ్ల కోసం అమరావతిలో అదనపు భూ కేటాయింపునకు జగన్ గ్రీన్ సిగ్నల్

-

జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. అమరావతి రాజధానిలో విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పేదల ఇళ్ల పట్టాల కోసం రాజధానిలో అదనపు భూ కేటాయింపునకు జగన్‌ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు అదనంగా 268 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్. సీఆర్డీఏ ప్రతిపాదనలకు జగన్‌ సర్కార్ అంగీకారం తెలిపింది. దీంతో పేదల ఇళ్ల పట్టాల కోసం రాజధానిలో అదనపు భూ కేటాయింపునకు లైన్‌ క్లియర్‌ అయింది.

ఇది ఇలా ఉండగా, నేడు విజయవాడ NIA కోర్టులో కోడి కత్తి కేసు విచారణ జరుగనుంది. ఈ విచారణ సందర్భంగా సీఎం జగన్ వేసిన రెండు పిటిషన్ల పైన మరల తమ వాదన లను వినిపించనున్నారు ఆయన తరఫు న్యాయవాది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు సీఎం జగన్.అడ్వకేట్ కమిషనర్ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అభ్యర్థించారు సీఎం జగన్‌. ఇక కోడి కత్తి కేసులో కుట్ర కోణంలో విచారణ జరగలేదంటూ పిటిషన్ దాఖలు చేశారు సీఎం జగన్ తరపు న్యాయవాది. కాగా, నిందితుడు, ఎన్ఐఏ తరఫు వేసిన కౌంటర్ల పైన నేడు కొనసాగనున్నాయి వాదనలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version