ఏపీ పెన్షన్ దారులకు జగన్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే నెల నుంచి ఆదనంగా రెండున్నర లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు జగన్ పుట్టినరోజు సందర్భంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆర్భాటం చేశారు. అదనం అనేది ఉత్తిదే. పాత జాబితాలో భారీగా కోతలు పెట్టి, కొత్తగా 2.5 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త పెన్షన్ల జాబితా తొలగించిన పెన్షన్ల జాబితాలు చేరాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 10 శాతం వరకు పింఛన్లు కట్ అయ్యాయి. అంటే, రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల దాకా పెన్షన్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి పెన్షన్ మొత్తం రూ. 2750 చేస్తున్నామంటూనే, పెద్ద సంఖ్యలో పింఛన్లను తొలగించడంతో అవ్వ, తాతలు బోరుమని విలపిస్తున్నారు. మరి దీనిపై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.