కాంగ్రెస్‌ డ్యామేజ్‌కు ఆయనే కారణం..దిగ్విజయ్ ఏం తేలుస్తారు?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి..ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మొదట వీరి మధ్య టి‌పి‌సి‌సి పదవుల పంపకాలతో తలనొప్పి వచ్చింది. టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, సగం పదవులు వారికే ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి వారు విమర్శలు చేశారు.

 

దీంతో రేవంత్ వర్గం భగ్గుమంది..టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పైగ్ సీనియర్లు సేవ్ కాంగ్రెస్ అంటూ ముందుకెళ్లడంపై ఫైర్ అయ్యారు. ఇంతకాలం అనేక మంది పార్టీ మారిన పట్టించుకొని వారు ఇప్పుడు సేవ్ కాంగ్రెస్ అనడం దురదృష్టకరమని వాపోయారు. ఇలా సీనియర్లు వర్సెస్ రేవంత్ వర్గం అన్నట్లు పోరు నడుస్తుండటంతో..అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్..రాష్ట్రానికి వచ్చారు. తాజాగా గాంధీ భవన్‌లో వన్ బై వన్ నేతలతో సమావేశమై..వారి సమస్యలని తెలుసుకున్నారు.

అయితే మెజారిటీ సీనియర్లు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పైనే ఫైర్ అయ్యారని తెలిసింది. ఆయన ఒంటెద్దు పోకడలతో  వెళుతున్నారని, రేవంత్ చెప్పిందే చేస్తున్నారని, ఆయన వల్లే పార్టీలో సంక్షోభం వచ్చిందని సీనియర్లు భగ్గుమన్నారు. తమని లెక్క చేయడం లేదని, ఆఖరికి పదవుల భర్తీ విషయంలో సీనియర్లని పరిగణలోకి తీసుకోలేదని ఉత్తమ్, భట్టి, దామోదర, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, వి‌హెచ్, మహేశ్వర్ రెడ్డి..ఇలా కొందరు సీనియర్లు మాణిక్కంని టార్గెట్ చేశారు. ఆయన్ని మార్చాలని డిమాండ్ చేశారు. అటు రేవంత్ వర్గంలో సీతక్క, రోహిన్ రెడ్డి లాంటి వారు తమ వాదనలు చెప్పారు.

అయితే ఈ అంశంపై అధిష్టానానికి వివరిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు. అలాగే అందరికీ కలిపి వార్నింగ్ కూడా ఇచ్చారు. విభేదాలు ఉంటే పార్టీ లోపాలు ఉంటే లోపలే చూసుకోవాలని, ఎవరు వీధికెక్కి విమర్శలు చేయకూడదని సూచించారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ విభేదాలు తగ్గుతాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news