ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..వయోపరిమితి పెంపు.. వచ్చే ఏడాది వరకు పొడిగింపు

-

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. నిరుద్యోగుల వయో పరిమితి గడువును పొడిగిస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్-యూనిఫామ్ పోస్టుల వయోపరిమితిని ఏపీపీఎస్సీ గతేడాది 32 నుంచి 42 ఏళ్లకు పెంచింది.

AP assembly elections in March and April said CM Jagan
Jagan Mohan Reddy government orders extending the age limit of unemployed

ఈ పెంపు దల ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియగా… వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సిఎస్ జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. ఏపీపీఎస్సీ సహా ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు చేపట్టే నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

కాగా, రేపు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సామర్లకోటలోని జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  రేపు ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. రేపు పేదల చేతికి ఇళ్లు అందించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news