ఈ ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ భేటీలో ఇసుక కొత్త పాలసీ పై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇసుక పాలసీ పై ప్రజాభిప్రాయం స్వీకరించింది ప్రభుత్వం. దీంతో నేటి క్యాబినెట్ భేటీలోనే కొత్త ఇసుక పాలసీ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ కొత్త ఇసుక పాలసీతో పాటుగా జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
అలానే మచిలీపట్నం పోర్టు డీపీఆర్ పై కూడా క్యాబినెట్ చర్చించనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా క్యాబినెట్ లో చర్చించనునుంది ఏపీ క్యాబినెట్. రాష్ట్రంలో వరదలు, వర్షాల వల్ల కలిగిన ఆస్తి, పంట నష్టం కూడా చర్చకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక జగనన్న తోడు పధకం అమలు,పోలవరం ప్రాజెక్ట్ నిధుల వ్యవహారంపైనా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణపైనా క్యాబినెట్ లో చర్చ ముఖ్యంగా జరిగే అవకాశం ఉంది.