రేపు మేము అధికారంలోకి వచ్చాక నేను చెప్పినా కూడా మా వాళ్లు వినరని వార్నింగ్ ఇచ్చారు ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్. దెబ్బ తగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో… తప్పు తెలుసుకో… తప్పుడు సంప్రదాయాలను సరిదిద్దుకో అని హెచ్చరించారు ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్.

పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాలలో డైలాగులు తీసేయండి అంటూ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాల్లోని డైలాగులపై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్, బాలయ్య సినిమాల్లోని డైలాగులు ఎంతో దారుణంగా ఉంటాయని ఫైర్ అయ్యారు. కానీ.. వాటినే పోస్టర్లలో పెడితే మాత్రం తప్పని కేసులు పెడుతున్నారు… మరి ఆ డైలాగ్స్ ఎందుకు పెడుతున్నారు? సెన్సార్ బోర్డు ఎందుకుంది? అని నిలదీశారు జగన్ మోహన్ రెడ్డి.