ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఈ పక్క తంతే ఆ పక్క పడతాడు అంటూ చురకలు అంటించారు వైఎస్ జగన్. TDP అంటే తెలుగు డ్రామా పార్టీ అని మాజీ సీఎం జగన్ కొత్త నిర్వచనం చెప్పారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చడం సత్తా అవుతుంది కానీ.. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను మరిచి.. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన అని జగన్ విమర్శించారు. కార్యకర్తలను గడపగడపకు తిప్పే ధైర్యముందని మహానాడు వేదిక పైనుంచి చెప్పాలని ప్రశ్నించారు జగన్.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఈ పక్క తంతే ఆ పక్క పడతాడు – వైఎస్ జగన్ pic.twitter.com/mOA4csQLUp
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025