చంద్రబాబు వయస్సుపై జగన్‌ సెటైర్లు..75 ఏళ్లు ఉండి ఏం పీకాడంటూ ?

-

చంద్రబాబు వయస్సుపై జగన్‌ సెటైర్లు వేశారు. 75 ఏళ్లు ఉండి ఏం పీకాడంటూ ఫైర్ అయ్యారు. ఎర్రగుంట్లలో జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ… నాకంటే ముందు 75 ఏళ్ల చంద్రబాబు సీఎంగా వున్నారు…14 ఏళ్ళు సీఎంగా ఉండి.. ఏం చేశారని నిలదీశారు.

నేను చిన్నవాన్ని… చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన ఏరోజైన చేశాడా ? అంటూ నిప్పులు చెరిగారు. ఎర్రగుంట్లలోనే 93 శాతం మందికి లబ్ది చేకూరిందన్నారు. మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగింది..మార్పు కొనసాగడం అవసరమని నిలదీశారు.

ఇంటికీ వెళ్ళాక ఆలోచించండి…భార్య, పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోండని కోరారు. వ్యవస్థ లో సామర్థ్యం పెంచేందుకు సలహాలు ఇవ్వండని సూచనలు చేశారు జగన్‌. మీరు సాలహాలు ఇస్తే వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news