ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇవాళ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేయనుంది జగన్ సర్కార్. జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఇవాళ విడుదల చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఈ జగనన్న విద్యా దీవెన నిధుల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ఇక విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్లను ఇవాళ వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం జగన్. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటి వరకు జగనన్న విద్యాదీవెన క్రింద 26,98,728 మంది విద్యార్థులకు లబ్ది చేకూరింది. అటు తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన క్రింద ఆర్థిక సాయం రూ.10,636.67 కోట్లు జమ చేసింది.ఇక ఇవాళ జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.