తెలంగాణ దశాబ్ది ఉత్సవ షెడ్యూలు ఖరారు

-

జూన్‌ 2 నుంచి 22 వరకూ 21 రోజులపాటు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉండేలా రూపొందించారు.

జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు.

జూన్‌ 3న ‘తెలంగాణ రైతు దినోత్సవం’

జూన్‌ 4: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’

జూన్‌ 5: ‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’

జూన్‌ 6: ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’

జూన్‌ 7: ‘సాగునీటి దినోత్సవం’

జూన్‌ 8: ‘ఊరూరా చెరువుల పండగ’

జూన్‌ 9: ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’

జూన్‌ 10: ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’

జూన్‌ 11: ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’

జూన్‌ 12:  పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రన్‌’ నిర్వహిస్తారు.

జూన్‌ 13: ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’

జూన్‌ 14: ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం’

జూన్‌ 15: ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’

జూన్‌ 16: ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’

జూన్‌ 17: ‘తెలంగాణ గిరిజనోత్సవం’

జూన్‌ 18: ‘తెలంగాణ మంచి నీళ్ల పండగ’

జూన్‌ 19: ‘తెలంగాణ హరితోత్సవం’

జూన్‌ 20: ‘తెలంగాణ విద్యాదినోత్సవం’

జూన్‌ 21: ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’

జూన్‌ 22: ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమం నిర్వహిస్తారు. రాజధానిలో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news