ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. జగనన్న విద్యా దీవెన పథకంపై కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈనెల 7న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ డబ్బులు జమ చేయనున్నారు.
2022-23 కు సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి నిధుల్ని విడుదల చేస్తారు. దాదాపు 11.02 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. గత నెల 28 నే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తోలుత ప్రకటించగా, అనివార్య కారణాలతో వాయిదా పడిన విష యం తెలిసిందే.
కాగా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు..ఇప్పటికే జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం పేరుతో పలు పథకాలను అమలు చేస్తోంది ప్రభుత్వం.