ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు, వారి తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న వసతి దీవన పథకం కింద నేడు అర్హులకు రెండో విడత డబ్బులు జమ కానున్నాయి. ఈ రోజు నంద్యాల పర్యటనకు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్.. అక్కడే బటన్ నొక్కి జగనన్న వసతి దీవెన పథకం రెండో విడత డబ్బులను అర్హలు అయిన తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ రెండో విడత లో రూ. 1,024 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది.
కాగ ఉన్నత విద్య అసభ్యసిస్తున్న విద్యార్థులకు సాయం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏటా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులను జమ చేయనుంది. రెండు విడతల్లో డబ్బును ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కింద ప్రతి ఏడాది ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్కిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ. 20 వేలను ప్రభుత్వం సాయం కింద ఇస్తుంది.
చదవుకునే విద్యార్థులకు వసతి, రవాణా ఖర్చులు, భోజనం ఖర్చులకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,68,150 మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది.