ట్విట్ట‌ర్‌లో టాప్‌ట్రెండింగ్‌లో జ‌గ‌న్‌..

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా పాల‌నా బాధ్య‌త‌లు చేప‌ట్టి నేటికి రెండేళ్లు పూర్త‌యింది. దీంతో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో జ‌గ‌న్ పోస్టులు వ‌ర‌ద‌ల్లా క‌నిపిస్తున్నాయి. ఎవ‌రు చూసినా జ‌న‌గ్ పోస్టులే పెడుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ఇవాళ టాప్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ల‌క్ష‌లాది మంది వైఎస్ అభిమానులు వ‌రుస ట్వీట్ల‌తో మోత మోగిస్తున్నారు.

దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2ఇయర్స్‌ ఫర్‌ వైఎస్‌ జగన్‌ అనే నేను’హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు టాప్ లో ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో క్రియేట్‌ చేసిన రెండున్నర గంటల్లోనే లక్ష మందికిపైగా ట్వీట్లు చేశారు. ఇదే కాదు గ‌తేడాది కూడా జ‌గ‌న్ పాల‌న‌కు ఏడాది పూర్తియిన సంద‌ర్భంగా క్రియేట్ చేసిన హ్యాష్‌టాగ్‌ను 20ల‌క్ష‌ల‌మందికి పైగా ట్రెండింగ్‌లో నిల‌పారు. ఇప్ప‌డు ట్రెండింగ్ చూస్తుంటే.. గ‌తేడాది రికార్డును దాటేలాగే ఉంది.