ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ సమావేశాల్లో భాగంగా శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఈ తరుణంలోనే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గత వైసీపీ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
అసెంబ్లీలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో చెప్పిన జగన్ మృతుల పేర్లను మాత్రం చెప్పలేకపోయారు అని తెలిపారు. అసెంబ్లీకి వచ్చి.. ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్ కి లేదా? అని ఆమె అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలపై వివరాలిచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు హోం మంత్రి అనిత.