చంద్రబాబు అరెస్టు, జనసేన -టీడీపీ పొత్తుపై ఇవాళ జగన్ ప్రసంగం ?

-

చంద్రబాబు అరెస్టు, జనసేన -టీడీపీ పొత్తుపై ఇవాళ సీఎం జగన్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ నిడదవోలులో కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్. లండన్ పర్యటన తర్వాత మొదటి సారి బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

CM YS Jagan's visit to Vizianagaram district today
CM YS Jagan’s visit to west godavari district today

ఈ తరుణంలోనే తాజా రాజకీయ పరిణామాల పై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు, జనసేన -టీడీపీ పొత్తు పై సీఎం జగన్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిన్నటి విజయనగరం జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో రాజకీయ విమర్శలు లేకుండా జగన్ ప్రసంగం సాగింది.

ఇవాళ్టి సీఎం జగన్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. ఇక అటు ఇవాళ వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనుంది జగన్‌ సర్కార్‌. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో భాగంగానే… ఇవాళ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం చేయనుంది ఏపీ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news