జగన్ తిరుమల పర్యటన రద్దు..?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ తిరుమల పర్యటన రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. తిరుమల పర్యటన రద్దు పై మరికొద్ది సేపట్లోనే మీడియా ముందుకు రానున్నారు జగన్. ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రదానంగా జగన్ తిరుమలకు వస్తారని ప్రకటించినప్పటి నుంచే టెన్షన్ వాతావరణం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాలని ఓవైపు కూటమి అభ్యర్థులు, మరో వైపు  హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎలాంటి గొడవలు, ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోకూడదనే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి రేణిగుంటకు బయలుదేరుతారని షెడ్యూల్ ఖరారు అయింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు తిరుమలకు చేరుకొని రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్టు నాలుగు రోజుల కిందనే ప్రకటించారు జగన్. మరోవైపు వైసీపీ నేతలు భారీగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అనవసర సమస్యలు రావద్దనే ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news